LIVE: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు- ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2026 at 9:50 AM IST

|

Updated : October 12, 2026 at 12:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

Dasara Navaratri Celebrations at Indrakeeladri Vijayawada LIVE: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక ఈ మంత్రానికి గాయత్రి అనే పేరు. గాయత్రీదేవి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉచితంగా అన్ని క్యూలైన్లలో నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడలో దుర్గగుడిలో దసరా ఏర్పాట్లు భక్తులను ఆకర్షిస్తున్నాయి. దేవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. ఇదిలా ఉండగా తొలి రోజు అమ్మవారిని లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : October 12, 2026 at 12:00 PM IST