ఆన్​లైన్​లో నోటిఫికేషన్​ - రూ.24 లక్షలు పెట్టుబడి - ఆ తర్వాత నో రిప్లై - ONLINE FRAUDS

🎬 Watch Now: Feature Video

thumbnail
ఇన్​స్టాగ్రామ్​ వచ్చిన యాప్​లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యక్తి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 14, 2026 at 5:28 PM IST

1 Min Read
Choose ETV Bharat

Cyber Frauds through Instagram : ఇన్ట్​గ్రామ్​లో వచ్చిన యాప్​లో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఒకరు పోలీసులను ఆశ్రయించిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం చీరాల పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన హనుమకొండ గోపి ఇన్​స్టాగ్రామ్​లో వచ్చిన నోటిఫికేషన్ చూసి రూ. 24,16,000 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత దానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా ఆగిపోవడమే కాకుండా అందులో ఉన్న ఫోన్​ నంబరు పని చేయడం లేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. 

హనుమకొండ గోపి చెన్నైలో బ్యాంకింగ్​ సెక్టార్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్​స్టాగ్రామ్​లో స్టాక్​ మార్కెట్​ గురించి నోటిఫికేషన్ వచ్చింది. వాళ్లతో చాట్​ చేసిన తర్వాత కాప్​స్టోనిన్ అనే మొబైల్ యాప్ ద్వారా వాట్సప్​లో మాట్లాడాలని చెప్పారు. వాట్సప్​లో గ్రూప్ చాట్ జరిగింది. మొదట కొంత నగదు కట్టమన్నారు. అలా కొద్ది కొద్దిగా కట్టాలని చెప్పారు. మొత్తం 24 లక్షల 15 వేలు కట్టించారు. విత్​డ్రా కావాలని గోపి అడిగినపుడు ఇంకా కట్టాలని చెప్పారు. చివరికి బాధితుడు మోసపోయానని గ్రహించారు. సైబర్ కేసు పెట్టారని తెలిపారు. ఇలాంటి యాప్​ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details