పడవల పోటీల ట్రయల్ రన్లో అపశృతి - కాల్వలో పడిపోయిన కలెక్టర్ - COLLECTOR FELL INTO CANAL
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 1:30 PM IST
Collector Mahesh Kumar Fell Into Canal in Atreyapuram : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన పడవల పోటీల ట్రయల్ రన్లో అపశృతి చోటుచేసుకుంది. పడవను నడుపుతున్న జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ అదుపు తప్పి కాల్వలో పడిపోయారు. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు ఆయన్ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 11 నుంచి మూడు రోజులు పాటు గోదావరి మధ్య డెల్టా ప్రధాన కాలువలో డ్రాగన్ పడవల పోటీలు జరగనున్నాయి. ఇవాళ ఏర్పాట్లును పర్యవేక్షించి, ట్రయిల్ రన్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఆత్రేయపురం వచ్చారు. అనంతరం డ్రాగన్ బోట్లో ప్రయాణించి కయాకింగ్ బోట్‌ను కలెక్టర్ స్వయంగా నడుపుతున్న క్రమంలో అదుపు తప్పి కాలువలో పడిపోయారు. లైఫ్ జాకెట్ వేసుకోవడం, గజ ఈత గాళ్లు దగ్గరలోనే ఉండడంతో ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. కలెక్టర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.