LIVE : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 21, 2026 at 5:30 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddys Visit to Kodangal : కొడంగల్​ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక నమూనాగా నిలవాలన్న ఉద్దేశంతో అక్కడి రూపురేఖలు మార్చే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.10 వేల కోట్లు కేటాయించింది. అయితే చేపట్టిన ప్రాజెక్టుల్లో కొన్ని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ మరికొన్ని మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యక్ష పరిశీలనకు వచ్చారు. అయితే మొదట అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు. కొనసాగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ హకీంపేటలోని ఎడ్యుకేషన్‌ హబ్‌ను పరిశీలించారు. కాగా సీఎం మంగళ, బుధవారాల్లో దుద్యాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, కొడంగల్‌లో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో హకీంపేట్​కు చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష అనంతరం రాతకి కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి చేరుకున్నారు. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఓలతో ఓటర్ నమోదు ప్రక్రియ సర్​పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు పట్టిష్టమైన పద్ధతి ఏర్పాటు చేశారు.