LIVE : ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video

Published : January 18, 2026 at 2:34 PM IST
|Updated : January 18, 2026 at 2:58 PM IST
CM Revanth Reddy Live From Khammam : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. తొలుత మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తారు. తరువాత మున్నేరు - పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. ఆపై కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రాంతంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా ముఖ్యమంత్రి కార్యక్రమాల ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. దీనికి సంబంధించిన విషయాలను ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.