LIVE : ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్​రెడ్డి - CM REVANTH VISIT TO OU

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Revanth Visit OU Live (ETV)

By ETV Bharat Telangana Team

Published : December 10, 2025 at 12:58 PM IST

|

Updated : December 10, 2025 at 2:17 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Visit OU Live : ఇవాళ సీఎం రేవంత్​రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారు. ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఓయూ అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉంది. చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. అకడమిక్​ బ్లాక్​లు, హాస్టళ్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు సీఎం ఇప్పటికే పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన సీఎం రేవంత్​రెడ్డి పలు హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎలాంటి హామీలు, యూనివర్సిటీ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఉస్మానియాలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడి బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేశారు. యూనివర్సిటీలోని హాస్టళ్లకు వెళ్లి బీఆర్​ఎస్వీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఇప్పుడు సీఎం రేవంత్​రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : December 10, 2025 at 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details