LIVE : శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అభ్యర్థుల వెలిడిక్టరీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
CM REVANTH REDDY LIVE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 6:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

LIVE : గ్రూప్​-1 నియామకాలకు సంబంధించి సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో  తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఎంపికైన అభ్యర్థుల భవితవ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే. గతంలో గ్రూప్​-1 నియామకాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయపోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 563 మంది గ్రూప్​-1 అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్​-1 అధికారులైన మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2024 ఫిబ్రవరిలో గ్రూప్​-1లో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను​ జారీ చేసింది. 2024 అక్టోబరు 21వ తేదీ నుంచి 27 వరకు ప్రధాన పరీక్షలు(మెయిన్స్) జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను టీజీపీఎస్సీ ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్​తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను వెల్లడించింది. గ్రూప్-1, 2 ట్రైనీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details