LIVE : డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY PRESS MEET
🎬 Watch Now: Feature Video

Published : April 13, 2026 at 4:30 PM IST
|Updated : April 13, 2026 at 5:28 PM IST
CM Revanth Reddy Press Meet On Delimitation : లోక్ సభ సీట్ల పెంపులో దక్షిణాధి రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికన కాకుండా దేశ వృద్ధిలో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న అంశాల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేంద్రం, మహిళా రిజర్వేషన్లతో పాటు సీట్ల పెంపు చేపడుతోందని, ఈ రెండు వేర్వేరు అంశాలని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని కానీ లోక్ సభ సీట్ల పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయని రేవంత్ అన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలుపరిస్తే దేశం మొత్తం ఆమోదిస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టుకొని లోక్ సభ సీట్లను పెంపును జనాభా ప్రాతిపదికన చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ విధానం భవిష్యత్తులో దేశాన్ని బలహీనం చేస్తుందని అన్నారు. జాతీయ ప్రయోజనాలే ఏ పార్టీకైనా ముఖ్యంగా ఉండాలని తెలిపారు. డీలిమిటేషన్ మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం