LIVE : రాజీవ్​గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్​రెడ్డి నివాళులు - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY

🎬 Watch Now: Feature Video

thumbnail
CM REVANTH REDDY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 21, 2026 at 11:13 AM IST

|

Updated : May 21, 2026 at 11:29 AM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy Participating Rajiv Gandhi Death Anniversary : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక భారతదేశ నిర్మాతగా, దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి, యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. దేశంలో 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించి, వారిని రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేసిన నేతగా అభివర్ణించారు. స్థానిక సంస్థల చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజీవ్ గాంధీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Last Updated : May 21, 2026 at 11:29 AM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details