LIVE : పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - TELANGANA FORMATION DAY
🎬 Watch Now: Feature Video

Published : June 2, 2026 at 8:04 AM IST
|Updated : June 2, 2026 at 9:52 AM IST
Telangana Formation Day Celebrations in Hyderabad : ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోన్న వేళ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సచివాలయం, అసెంబ్లీ వంటి ముఖ్యమైన కట్టడాలు, ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు గన్‌పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో ఆయా మంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.