LIVE : మిడ్జిల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - REVANTH REDDY MIDJIL TOUR
🎬 Watch Now: Feature Video

Published : July 4, 2026 at 4:47 PM IST
|Updated : July 4, 2026 at 6:15 PM IST
CM Revanth Reddy Live : 20 ఏళ్ల రాజకీయ జీవితానికి పురుడు పోసిన గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. జడ్పీటీసీగా మొదలై, నేడు రాష్ట్ర రథసారథిగా ఎదిగిన సీఎం రేవంత్ తనను ఆదరించిన ప్రజలకు, నడిపించిన నేలకు నమస్కరించారు. తొలుత నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, తొలి ప్రయాణంలో తన వెంట నడిచిన నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి, మిడ్జిల్ వాసులకు భావోద్వేగ పూరితమైన వేడుకగా ఈ యాత్ర నిలిచింది. ఈ పర్యటనకు ముందు 20 ఏళ్ల రాజకీయ జీవితంపై భావోద్వేగంతో 'ఎక్స్'లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు. మిడ్జిల్‌లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రెండు దశాబ్దాల ప్రజాజీవితం మరపురాని మధురజ్ఞాపకమన్నారు. రేవంత్‌రెడ్డిగా మెుదలైన ప్రయాణం.. రేవంతన్నగా నిలిచే స్థాయికి చేరింది సంతోషం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయమని, ప్రతి సందర్భం, సంఘటన, సంఘర్షణలో అండగా ఉన్న ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.