నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video

Published : July 7, 2026 at 5:51 PM IST
|Updated : July 7, 2026 at 6:48 PM IST
CM Revanth Reddy At Nacharam Balamrutham Plant LIVE : అంగన్వాడీ పిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం అంగన్వాడీ పిల్లలకు బాలామృతం పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు బయట కాంట్రాక్టులు ఇచ్చి ఈ బాలామృతం తయారు చేయించేవారు. నేడు దీనిని ప్రభుత్వమే తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇందుకోసం నాచారంలోని తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో బాలామృతం తయారు చేసే ప్లాంట్ నిర్మాణం జరిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ బాలామృతం ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఈ ఫ్లాంట్ నిర్మాణం చేసినట్లు అధికారులు వివరించారు. బాలామృతం మెషిన్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ప్లాంట్ ప్రారంభంలో భాగంగా మొక్కను నాటారు. ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం..