LIVE : అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - ALLU CINEMAS OPENING CEREMONY
🎬 Watch Now: Feature Video

Published : March 12, 2026 at 5:50 PM IST
CM Revanth Reddy Attended Allu Cinemas Opening Ceremony : అల్లు సినిమాస్‌ను ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్‌గా రూపొందించారు. అల్లు సినిమాస్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో అతిథిగా హాజరయ్యారు. నేడు లాంఛనంగా ప్రారంభమయిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 19 నుంచి సినిమాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇందులో 4 స్క్రీన్లు ఉండగా స్క్రీన్ 1లో డాల్బీ విజన్ ఉంది. శుక్రవారం (మార్చి 13) నుంచి 'బుక్ మై షో' ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు అల్లు సినిమాస్ ప్రకటించింది. ఇందులో తొలుత ధురంధర్ 2, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు సందడి చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అల్లు సినిమాస్ డాల్బీ థియేటర్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన మొదటి డాల్బీ థియేటర్ కాగా, దేశంలో మూడోది.