LIVE : తెలంగాణ పబ్లిక్​ స్కూల్​ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ - ప్రత్యక్షప్రసారం - TELANGANA PUBLIC SCHOOL CONCEPT

🎬 Watch Now: Feature Video

thumbnail
CM REVANTH REDDY INAUGURATE TELANGANA PUBLIC SCHOOL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : June 17, 2026 at 10:00 AM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy Inaugurate Telangana Public School : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్​ స్కూల్​ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన తన ఎక్స్​ ఖాతాలో ఇలా పోస్టు చేశారు. "భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందన్నది ఇక పై ఒక నినాదం మాత్రమే కాదు. కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న నా సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్. చరిత్ర పుటల్లో కలిసిపోతున్న సర్కారు బడి ప్రజా పాలనలో నేడు మళ్లీ పూర్వవైభవాన్ని మించిన వైభవంతో, సకల సౌకర్యాలతో, ఆధునిక వసతులతో, పిల్లల మేధో వికాస్ క్షేత్రంగా నిలవబోతోంది. తెలంగాణ బిడ్డల పాలిట సరస్వతీ కటాక్ష ఆలయంగా రూపుదిద్దుకున్నది. ఆకలి తీర్చి, అక్షరాలు నేర్పి, ఆటను ప్రోత్సహించి పిల్లల్లో మనో వికాసం వికసించేలా, మట్టిలో మాణిక్యాలను తీర్చి దిద్దే సకల హంగులతో రూపుదిద్దుకున్న నా మానస పుత్రిక ఈ పాఠశాల. తెలంగాణ పబ్లిక్ స్కూల్​కు రూపం ఇచ్చే కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు అభినందనలు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న నేటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్​లో వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడం తదుపరి మా కర్తవ్యం" అని రాసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details