LIVE: పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - చంద్రబాబు పోలవరం టూర్ లైవ్

🎬 Watch Now: Feature Video

thumbnail
Chandrababu Polavaram Tour Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 13, 2026 at 3:12 PM IST

|

Updated : July 13, 2026 at 6:33 PM IST

1 Min Read
Choose ETV Bharat

Chandrababu Polavaram Tour Live : మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి తెదేపా ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్దం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. 2014లో రూ.32 కోట్లతో 64 గేట్ల మరమ్మతులు చేశామని చెప్పారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడం కాదు కదా కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. అనంతరం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.

Last Updated : July 13, 2026 at 6:33 PM IST