LIVE: పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU REVIEW POLAVARAM WORKS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 3:08 PM IST
|Updated : January 7, 2026 at 3:50 PM IST
CM Chandrababu Visit Polavaram Live : ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4వ సారి పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణ చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ నూ సీఎం పరిశీలించారు. ఎర్త్ కం రాక్ ఫీల్డ్- ECRF గ్యాప్-1, గ్యాప్-2 పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. పునరావాసం, నిర్వాసితుల సమస్యలపై సూచనలు చేశారు. అయితే గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగినట్లు తెలిపాయి.