Live: అనకాపల్లిలో గోదారమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
అనకాపల్లిలో గోదారమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 3:18 PM IST

|

Updated : September 2, 2026 at 5:50 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu to Perform Jala Harathi at payakaraopeta : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ ఆన్​ చేసి అధికారికంగా ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేశారు. అనంతరం పాయకరావుపేట బహిరంగ సభలో సీఎం పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లిస్తానన్న హామీని నెరవేర్చారు. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. పంపా, తాండవ, వరాహ, శారద నదులపై అక్విడెక్టులు, సైఫన్ల నిర్మాణం పూర్తి చేశారు. పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో భారీ అక్విడెక్ట్ నిర్మాణం చేశారు. తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడెక్ట్​లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎడమ కాలువ నిర్మాణం కోసం రూ.4,192 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. అనకాపల్లిలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. ప్రస్తుతం జలహారతి కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : September 2, 2026 at 5:50 PM IST