LIVE: రావివలసలో ప్రజావేదిక కార్యక్రమం, పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM LIVE PROGRAM FROM RAVIVALASA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 12:32 PM IST
|Updated : February 28, 2026 at 2:09 PM IST
CM Chandrababu to Launch HPV Vaccination Drive in Vizianagaram District : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికలకు ఇస్తున్నహెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బాలికలతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం రావివలస గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రావివలసలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.