పోలవరం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM POLAVARAM PROJECT VISIT LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu Polavaram Project Visit LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 11:45 AM IST

|

Updated : January 7, 2026 at 12:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Polavaram Project Visit LIVE : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పోలవరం బట్రస్‌ డ్యాంను సందర్శించారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్1 , గ్యాప్2 పనులతో పాటు డయాఫ్రమ్‌ వాల్ పనులను పరిశీలించారు. పునరావస కేంద్రాలు, నిర్వాసితుల సమస్యలపై డ్యాం సైట్‌ వద్దే సీఎం చర్చ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టుతో పాటు నిర్వాసితులకు పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం వంటివి వేగవంతమయ్యాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని గత నెలలో జిల్లాలోని గొల్లగూడెం పర్యటనలో సీఎం చందబ్రాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

గతేడాది నవంబరులో నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్ల పరిహారం విడుదల చేశారు. ఇది ఇప్పటికీ కొందరికి అందలేదు. బాధితులకు పారదర్శకంగా పరిహారం అందించాలనీ, ఏ ఒక్క విమర్శకు తావుండకూడదని ముఖ్యమంత్రి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పదేపదే చెబుతున్నా యంత్రాంగం చెవికెక్కడం లేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన, అధికారులతో చర్చ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : January 7, 2026 at 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details