Live: "మీ భూమి-మీ హక్కు" కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 9, 2026 at 12:23 PM IST
|Updated : October 9, 2026 at 2:28 PM IST
CM Chandrababu participated in Mee Bhoomi Mee Hakku : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జరుగుమల్లి మండలం నర్సింగోలులో మీ భూమి-మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నర్సింగోలులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. 2వేల 9వందల 15ఎకరాల భూములకు సంబంధించి 1300 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. అదేవిధంగా కొండపి మండలంలోని ఇలవర, వెన్నూరు జరుగుమల్లి మండలంలోని పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె.బిట్రగుంట నాగులుప్పలపాడులోని ఓబన్నపాలెం, సింగరాయకొండలోని కాలికివాయ గ్రామాల్లో గర్భ కండ్రిక భూములకు విముక్తి కల్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రైతులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం మీ భూమి-మీ హక్కు కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.