LIVE: నిడదవోలులో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' - పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM NIDADAVOLU TOUR LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 18, 2026 at 1:35 PM IST
|Updated : April 18, 2026 at 2:53 PM IST
CM Participated in swarnandhra- Swachh Andhra Programme in Nidadavolu LIVE: ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల ‘జలధార-జలహారతి థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది. సీఎం చంద్రబాబు ఉదయం ఉండవల్లిలో హెలీకాఫ్టర్‌లో బయలుదేరి నిడదవోలు చేరుకున్నారు. అనంతరం సుబ్బారాజుపేట రోడ్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు చేరుకుని ప్రసంగించారు. అక్కడ నుంచి బయలుదేరి మలకోడు సరస్సు వద్దకు వచ్చారు. నీటి మొక్కల నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేసి శాస్త్రవేత్తలు ప్రజలతో చర్చించారు. ఆ తర్వాత సెయింట్ ఆంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే నేతల నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో మాధవ్, కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు సహా కూటమి నేతలు పాల్గొన్నారు. మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహమంటూ ప్లకార్డులతో మహిళల నిరసన తెలిపారు.
ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.