LIVE : అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - WOMENS DAY CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 8, 2026 at 12:28 PM IST
|Updated : March 8, 2026 at 2:42 PM IST
Womens Day celebrations in AP Live : 20 నెలల కూటమి పాలనలో చేపట్టిన మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను వివరించేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యేక వీడియోలతో పాటు, లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను చంద్రబాబు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. కీలకోపన్యాసం అనంతరం వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను సీఎం సందర్శించారు. చిరుధాన్యాల బండ్లు, ఎగ్ కార్ట్స్, ఫామ్ బజార్ వ్యాన్లు వంటి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఈ క్రమంలో 5 కొత్త పథకాలను ప్రారంభించారు. అలాగే 7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్‌టిసి మహిళా డ్రైవర్లు సహా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించారు.