LIVE: ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 9, 2026 at 11:30 AM IST
|Updated : August 9, 2026 at 1:53 PM IST
CM Chandrababu Participated In International Tribal Day Programme LIVE: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అడవితో, ప్రకృతితో ముడిపడి ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, వారి విశిష్టమైన జీవన విధానం మన సమాజానికి ఎంతో గర్వకారణమన్నారు. అందుకే ఆదివాసీల విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలు మెరుగుపరిచి వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ, వారి స్వయంసమృద్ధి, ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఆదివాసీ సోదరసోదరీమణులందరికీ చంద్రబాబు మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏటా ఆగస్టు 9న ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’గా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం విజయవాడ ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’ లో సీఎం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.