LIVE : ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CBN LIVE FROM TELUGU MAHASABHALU
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 11:42 AM IST
|Updated : January 5, 2026 at 1:47 PM IST
CM Chandrababu Participated in 3rd World Telugu Conference Live : తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు వైభవోతేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణల్లో భాషాభిమానులు సందడి చేయగా, సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపిస్తున్నారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు, మాతృభాషకు జై కొట్టారు. ఈనాడు వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు హస్తకళల ప్రదర్శనల ప్రాంగణంలోని కళారూపాలు, కళాకారుల సృజనకు అద్దంపట్టాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక చత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు. మాతృభాష ఉన్నతికి ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహించాలని ఆకాంక్షించారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నేడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తెలుగు మహా సభలకు హాజరయ్యారు.