LIVE: నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన - రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ- ప్రత్యక్ష ప్రసారం - CM NANDYAL DISTRICT TOUR LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 9, 2026 at 12:47 PM IST
|Updated : March 9, 2026 at 2:50 PM IST
CM Chandrababu Nandyal District Tour LIVE: ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటన ప్రారంభమయ్యింది. పర్యటనలో భాగంగా సీఎం డోన్ నియోజకవర్గం కొత్తబురుజు గ్రామంలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కొత్తబురుజు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం గ్రామ సభలో పాల్గొన్న ఆయన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్థానిక రైతుల పంట పొలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చలు జరిపారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వారితో మాట్లాడారు. సాయంత్రం సీఎం తిరిగి అమరావతి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.