LIVE : ధవళేశ్వరం నూతన గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించిన చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - DOWLESWARAM BARRAGE GATES LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 13, 2026 at 12:18 PM IST
|Updated : July 13, 2026 at 1:52 PM IST
CM Chandrababu Live Today : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులు ప్రారంభించిన తర్వాత సీఎం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలవరం వెళ్లారు. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ - 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జీవనాడి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ రెండు శతబ్దాల చరిత్ర ఉన్న ఈ బ్యారేజీకి నేడు కొత్త కళ సంతరించుకుంది. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. భావి తరాలకు భరోసా ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో వీటిని రూపొందించనున్నారు. దాదాపు 152.95 కోట్లతో బ్యారేజీని మరింత సురక్షితంగా తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక పనులకు నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుకు గేట్లు అమర్చే పనులను ప్రభుత్వం బెకం సంస్థకు అప్పగించింది. ఈ పనులు పూర్తైతే గోదావరి డెల్టా సాగునీటి భద్రత మరింత బలపడనుంది.