LIVE: సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CM SANJEEVANI HOSPITAL OPENING LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 27, 2026 at 3:04 PM IST
|Updated : June 27, 2026 at 4:19 PM IST
CM Chandrababu Sanjeevani Hospital Opening Live : ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభించారు. అంతకుముందు దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో భేటీ అయ్యారు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందజేశారు. తద్వారా 2 వేల 351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలిగింది. గత ప్రభుత్వంలో కేవలం 96 కుటుంబాలకే పరిహారం అందజేశారు. పనులూ నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు పూర్తిచేస్తోంది. 24 నెలల్లోనే పరిహారం, పునరావాస పనులకు 903 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. మొత్తంగా 759 కోట్ల రూపాయల మేర పనులు పూర్తిచేసింది. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు, 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 15 లక్షల 25 వేల మందికి తాగునీటి కష్టాలు తీరాయి.