ఉత్తరాంధ్రలో గోదారమ్మ పరవళ్లు - జలహారతితో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

🎬 Watch Now: Feature Video

thumbnail
ఉత్తరాంధ్రలో గోదారమ్మ పరవళ్లు - జలహారతితో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 4:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Jalaharathi : ఉత్తరాంధ్ర జలచరిత్రను మలుపు తిప్పే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర తడిసి పరవశించింది. పోలవరం ఎడమ కాలువ నుంచి గోదారమ్మ గలగలా పారుతూ అనకాపల్లి గడ్డను ముద్దాడింది. నాలుగు నదులు, తూర్పు కనుమల్ని దాటుకుంటూ సాగిన ఈ జలప్రవాహానికి సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జలహారతితో స్వాగతం పలికారు. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల 23 వేల మంది దాహార్తిని తీర్చేలా తొలిదశ ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే ఏడాది విశాఖకు, ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి 89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే గోదావరి ప్రయాణంలో అసలు సవాలు నదులు, కొండలు. పంపా, తాండవ, వరాహ, శారద నదుల ప్రవాహాలను దాటేందుకు సైఫన్లు, అక్విడెక్టులు నిర్మించారు. ఏలేరు నది బెడ్‌ లెవల్‌ కంటే దిగువ నుంచి నీటిని తరలించేందుకు సైఫన్‌ ఏర్పాటు చేశారు. పంపా నదిపై 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో అక్విడెక్ట్‌ నిర్మించడం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ ప్రత్యేకతను చాటుతోంది.