వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు - నిర్వాసితులకు రూ.300 కోట్ల చెక్కుల పంపిణీ - VELIGONDA PROJECT COMPENSATION

🎬 Watch Now: Feature Video

thumbnail
వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు - నిర్వాసితులకు రూ.300 కోట్ల చెక్కుల పంపిణీ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 10:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu on Veligonda Project Compensation : ఏళ్ల తరబడి ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల నిరీక్షణకు తెరపడింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చకా ఇందుకోసం ఇటీవల రూ.905 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలివిడతలో సుమారు 2,400 మందికి గాను రూ. 300 కోట్లు విడుదల చేశారు. మిగిలిన వారికి రెండో విడతలో అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నేడు వెలుగొండ ప్రాజెక్టు ఫిడర్ కెనాల్ పనుల పురోగతి పరిశీలించారు. అనంతరం ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేశారు. దీంతో ముంపు గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ కష్టాలను కూటమి ప్రభుత్వం తీర్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి తమ ఖాతాల్లో నగదు జమ అవుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు నిర్వాసితులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నష్ట పరిహారం అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details