LIVE : విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026' - ప్రత్యక్షప్రసారం - AP MSME GROWTH SUMMIT 2026 LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2026 at 11:57 AM IST
|Updated : May 25, 2026 at 1:56 PM IST
AP MSME Growth Summit 2026 Live : రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మారుస్తూ ఎంఎస్‌ఎంఈ(MSME) రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలకు ఊపిరిపోస్తూ ప్రతిష్టాత్మక 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026' ను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదిక వేదిక ద్వారా సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈమెగా ఈవెంట్ ద్వారా కొత్తగా 38 పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈ సదస్సు ఒక బలమైన పునాదిగా నిలవనుంది. 15వందల మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 175 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రచించింది. తొలి 2 దశల్లో 100 ప్రాజెక్టుల పనులు మొదలవ్వగా నేడు మూడో విడత కింద 38 పార్కులకు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సరికొత్త పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించేలా ఈ పార్కుల్లో అత్యాధునిక 'ప్లగ్-అండ్-ప్లే' మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.