LIVE: కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ - రైతులతో చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU DISTRIBUTING PASSBOOKS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 2:04 PM IST
|Updated : January 9, 2026 at 4:02 PM IST
CM Chandrababu Distributing Passbooks Live : ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో పర్యటించారు. ఉదయం ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి రాయవరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం రాయవరంలో ప్రజా వేదిక సభలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఇటీవల తూర్పుగోదావరిలో విలీనం చేశారు. హామీ నెరవేర్చిన తరువాత నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహేంద్రవాడ రహదారిలోని రామ్‌నారాయణ లే అవుట్‌లో ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ మందిరం, హెలిప్యాడ్ నిర్మాణాలు పూర్తిచేశారు. డాగ్‌స్క్వాడ్, ఎస్‌జీపీ కమాండోలు, ఇంటిలిజెన్స్ బృందాలు సభాప్రాంగణం, మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి విగ్రహావిష్కరణ కూడలి, రైతులతో సమావేశం కానున్న వ్యవసాయ క్షేత్ర ప్రాంతాలను అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.