LIVE : చంద్రబాబు 76వ పుట్టినరోజు - అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేసిన సీఎం దంపతులు - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU ANNA CANTEEN LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 20, 2026 at 9:57 AM IST
|Updated : April 20, 2026 at 10:31 AM IST
CM Chandrababu and his Wife Breakfast at Anna Canteen Live : ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలోని పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్నారు. చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్‌ల ఒక రోజు ఖర్చు కోసం 76 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఇవాళ 3 పూటలా ఉచితంగా ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వరితో కలిసి పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వద్దనున్న అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల MLAలు, ఎంపీలు, మంత్రులు భాగస్వాములు కానున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని వెల్లడించారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.