LIVE : ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video

Published : January 17, 2026 at 4:48 PM IST
|Updated : January 17, 2026 at 5:34 PM IST
CM Revanth Reddy Live : మహబూబ్నగర్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో రూ.1,284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లిలో రూ.200 కోట్లతో ట్రిపుల్ ఐటీకి భూమి పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తరువాత మహబూబ్నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై రూ.20.50 కోట్లతో ఆ కళాశాలలోని అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు.
యూఐడీఎఫ్ నిధులతో మహబూబ్నగర్ నగర పాలక సంస్థలో రూ.221 కోట్లతో తాగునీటి శుద్ధి కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఆపై రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఈటీవీ భారత్లో వీక్షిద్దాం.