LIVE : ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు - పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - CPI CENTENARY CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video

Published : January 18, 2026 at 4:13 PM IST
|Updated : January 18, 2026 at 4:51 PM IST
CPI Centenary Celebrations LIVE : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాలకు ఖమ్మం వేదికైంది. ఎటుచూసినా ఎర్రజెండాలు, అరుణ తోరణాలతో నగర పురవీధులు ఎరుపుమయంగా మారాయి. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం ఎస్.ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు సీపీఐ శ్రేణులు కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాయి. బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీపీఐ రాష్ట్ర నాయకత్వం, రెండు నెలలుగా చేస్తున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నుంచే కాక దేశవ్యాప్తంగా సీపీఐ నేతలు, శ్రేణులు కదిలివచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అరుణ సైన్యం ఖమ్మం గుమ్మంలో ఎర్రజెండాలతో కవాతు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు దాదాపు 200 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో మధ్యాహ్నం సీపీఐ కార్యకర్తలు సభాస్థలికి చేరుకున్నారు. భారీ సభా వేదికతో పాటు సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు.