LIVE : అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి - REVANTH PAYS TRIBUTE TO BR AMBEDKAR
🎬 Watch Now: Feature Video

Published : April 14, 2026 at 11:06 AM IST
|Updated : April 14, 2026 at 11:53 AM IST
CM RevanthReddy Tribute to B.R.Ambedkar Live : అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద జరిగే డా.బి. ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. హెచ్ఎమ్డీఏ గ్రౌండ్స్‌లోని అంబేడ్కర్ విగ్రహనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ ఆశయాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంబేడ్కర్ మ్యూజియం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన జయంతి సందర్భంగా అంబేడ్కర్ అద్భుతమైన జ్ఞాన గని, దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికీ హక్కులు కల్పించారని భట్టి విక్రమార్క అన్నారు. లింగ వివక్షతో బాధపడుతున్న మహిళలకు విముక్తి, అలాగే ప్రసూతి సెలవు, కార్మిక చట్టాలు తెచ్చిన గొప్ప దార్శనికుడని భట్టి విక్రమార్క అంబేడ్కర్‌ని స్మరించుకున్నారు.