LIVE : అంబర్‌పేటలోని బహిరంగసభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
సీఎం రేవంత్ రెడ్డి (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : August 31, 2026 at 5:05 PM IST

|

Updated : August 31, 2026 at 6:56 PM IST

1 Min Read
Choose ETV Bharat

Revanth Reddy Inaugurated the High-Level Bridge Built across the Musi River : హైదరాబాద్​ నగరవాసులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక తీరింది. అంబర్‌పేట-మూసారాంబాగ్‌ మూసీ నదిపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్‌ (ఎంసీహెచ్‌) గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల లోగోలు ఆవిష్కరించారు. దీనికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఈ వంతెన నిర్మాణ దశలో అనేక అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు పనులు పూర్తి చేయడం వాహనదారులకు చాలా ఉపశమనం కలిగింది. ఇది అందుబాటులోకి వస్తే చాదర్‌ఘాట్‌ వంతెనపై ట్రాఫిక్‌ భారం తగ్గి, ఆ మార్గంలో చాలా మేరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోయాయి. మూసీకి ఇరువైపులా అటు మూసారాంబాగ్‌ వైపు, ఇటు అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తా వద్ద బ్రిడ్జి నిర్మాణానికి వీలుగా కట్టడాలను తొలగించి రోడ్డును విస్తరించాల్సిన పరిస్థితి వచ్చింది. విస్తరణకు ప్రజలు ముందుకు రాకపోవడం, పరిహారం చెల్లింపు తదితర అంశాల పెండింగ్ కారణంగా పనుల్లో జాప్యం తదితర సమస్యలతో మూడేళ్ల సమయం పట్టింది. హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా చూద్దాం

Last Updated : August 31, 2026 at 6:56 PM IST