LIVE: చీరాలలో 'నేతన్న సేవలో' పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu Launched Nethanna Sevalo Scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 7, 2026 at 11:59 AM IST

|

Updated : August 7, 2026 at 1:47 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Launched Nethanna Sevalo Scheme LIVE: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట వేదికగా 'నేతన్న సేవలో' పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 చేనేత కుటుంబాల ఖాతాల్లోకి రూ.179 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా కొత్తపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతల ఆర్థిక పురోగతి కోసం పథకం నిబంధనల్లో కీలక మార్పులు చేశామని తెలిపారు.

వయసుతో గానీ, ఇంట్లో ఉన్న మగ్గాల సంఖ్యతో గానీ సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు వివరించారు. సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని స్పష్టం చేశారు. సభ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు జాండ్రపేటలో చేనేత వర్క్‌షాప్‌ను పరిశీలించారు. చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : August 7, 2026 at 1:47 PM IST