LIVE: వినుకొండలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU VISIT VINUKONDA LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
CBN Launch Swachh Andhra Programm Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 1:49 PM IST

|

Updated : February 21, 2026 at 3:15 PM IST

1 Min Read
Choose ETV Bharat

LIVE: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానంగా స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలీప్యాడ్​కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రజావేదికకు బయల్దేరారు. ఎన్​ఎస్​పీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. జిల్లాలోని వివిధ మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభ అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణపై సమీక్షిస్తారు. ఎన్నెస్పీ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణంతో పాటు ప్రజల అవసరాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభ్యర్ధిస్తానని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు తెలిపారు. చంద్రబాబు పర్యటనను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.

Last Updated : February 21, 2026 at 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details