Live : నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటన - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 5, 2026 at 11:14 AM IST
|Updated : October 5, 2026 at 1:10 PM IST
Chandrababu And Pawan Kalyan In Kadapa Tour Live : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం కడప జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వారు ప్రొద్దుటూరులో ప్రతిష్టాత్మకమైన 'జల్ జీవన్ మిషన్', 'అమరజీవి జలధార' కార్యక్రమాలను సంయుక్తంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే గొప్ప లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాల తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను అందించాలని యోచిస్తోంది. తాగునీటి కోసం మైళ్ల దూరం నడవాల్సిన గ్రామీణ మహిళల కష్టాలను ఈ కార్యక్రమం తొలగిస్తుంది. తద్వారా వారికి నేరుగా వారి ఇళ్లలోనే స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతుంది. ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతకు ఈ పథకం ఒక నిదర్శనంగా నిలుస్తుంది.