LIVE : దేశంలో గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రెస్​మీట్ - ప్రత్యక్షప్రసారం - CENTRAL GOVT ON GAS CRISIS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
CENTRAL GOVT ON GAS CRISIS LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 14, 2026 at 4:19 PM IST

|

Updated : March 14, 2026 at 4:57 PM IST

1 Min Read
Choose ETV Bharat

CENTRAL GOVT ON GAS CRISIS LIVE : దేశంలో ఎల్‌పీజీ వంటగ్యాస్ కొరత లేదని, భయంతో ఎవరూ గ్యాస్ బుక్ చేయొద్దని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ, పెట్రోలియం అండ్​ నేచురల్​ గ్యాస్,​ షిప్పింగ్​ శాఖల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతిరోజు దాదాపు 55.7 లక్షల ఎల్‌పీజీ బుకింగ్సే జరిగేవని, ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 75.7 లక్షలు దాటిందన్నారు. ప్రజలు భయాందోళనతోనే భారీ బుకింగ్స్ చేస్తున్నారని ఈ గణాంకాలతో స్పష్టమవుతోందని ఆమె చెప్పారు. ఇంతగా ఆందోళన అక్కర్లేదని, దేశంలోని 25వేల ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లలో ఏ ఒక్కరి దగ్గరా గ్యాస్ స్టాక్ పూర్తిగా అయిపోలేదని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోలు బంక్‌లకు పెట్రోలు, డీజిల్‌ల సప్లై నిలకడగానే జరుగుతోందని తెలిపారు. అన్ని బంక్‌లలోనూ పెట్రోలు, డీజిల్ లభిస్తున్నాయన్నారు. పెట్రోలు, డీజిల్‌ల తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఏటా 258 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధిచేసే కెపాసిటీ భారతదేశ రిఫైనరీలకు ఉందన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రిఫైనరీలు 100 శాతం కెపాసిటీతో పనిచేస్తున్నాయని తెలిపారు. మన దేశ రిఫైనరీల దగ్గర తగినన్ని ముడి చమురు నిల్వలు కూడా ఉన్నాయని వెల్లడించారు. 

Last Updated : March 14, 2026 at 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details