మొంటెద్దుల అమావాస్య - ఉత్సాహంగా ఎద్దుల పరుగు పోటీలు - YEDDULA POTILU
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 15, 2026 at 1:28 PM IST
Bull Running Competitions On The Occasion Of The New Moon : అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలంలో 'మొంటెద్దుల అమావాస్య' వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రైతులు ఉదయం తమ ఎద్దులను శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు వేసి అందంగా అలంకరించారు. అలంకరించిన ఎద్దులను స్థానిక దేవాలయాలకు తీసుకువెళ్లి, వాటికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం గ్రామాలలో ఎద్దుల పరుగు పందెంలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలలో గెలిచిన (మొదటి స్థానం పొందిన) ఎద్దులను గ్రామంలో ఊరేగించి సన్మానించారు. ఈ పరుగు పందెంలను వీక్షించడానికి విడపనకల్లు మండల రైతులే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సాంప్రదాయ పండుగ గ్రామీణ సంస్కృతిని, మూగ జంతువుల పట్ల రైతులకున్న ప్రేమను చాటింది. వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా నిలిచే మూగజీవాల (ఎద్దుల) పట్ల కృతజ్ఞతను చాటుకునే పండుగ ఇది. రాయలసీమ ప్రాంతంలోని గ్రామాల్లో దీనిని రైతులకు సంబంధించిన అతి పెద్ద పండుగగా భావిస్తారు.