ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు - బహుమతి ఎన్ని లక్షలో తెలుసా? - BULL COMPETITION AT MAHANANDI

🎬 Watch Now: Feature Video

thumbnail
ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు - బహుమతి ఎన్ని లక్షలో తెలుసా? (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 8:34 PM IST

1 Min Read
Choose ETV Bharat

Bull Competition at Mahanandi in Nandyal District : నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. మహానంది తెలుగుదేశం పార్టీ రైతు కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. మంత్రి ఎన్​ఎండీ. ఫరూక్‌ ఈ పోటీలను ప్రారంభించారు. ఎద్దుల బల ప్రదర్శన పోటీలు రైతులలో ఎంతో ఉత్సాహం నింపుతుందని మంత్రి ఫరూక్ చెప్పారు. సీనియర్స్‌, న్యూ కేటగిరి, ఆరు పళ్ల విభాగాల్లో పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. తమ ఎద్దులను బరిలో దించేందుకు ఎంతో మంది ఔత్సాహికులు అక్కడకు తరలి వచ్చారు. పోటీలను తిలకించేందుకు కూడా వేలాదిగా జనం తరలివచ్చారు. విజేతలకు కౌరా ఇన్​ ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన మాలపాటి పుల్లయ్య 9 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేయనున్నారు. దీంతో ఎడ్ల యజమానులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details