భిన్నమైన కేరీర్​ కోసం '​బీటెక్ డెయిరీ టెక్నాలజీ' - రాష్ట్రంలో ఒకే ఒక్క కాలేజి - BTECH IN DAIRY TECHNOLOGY

🎬 Watch Now: Feature Video

thumbnail
భిన్నమైన కెరీర్ కోరుకునే వారి కోసం 'బీటెక్ డెయిరీ టెక్నాలజీ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 16, 2026 at 5:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

B.Tech Dairy Technology : రొటీన్ కోర్సులతో విసిగిపోయిన యువతకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ మంచి అవకాశం కల్పిస్తోంది. భిన్నమైన కెరీర్ కోరుకునే వారి కోసం 'బీటెక్ డెయిరీ టెక్నాలజీ'ని అందిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు ఉన్న ఏకైక కోర్సు ఇది. ఏపీలో ఈ గుర్తింపుతో కోర్సు అందిస్తున్న ఒకే ఒక్క కాలేజీ తమదేనని డెయిరీ టెక్నాలజీ కళాశాల డీన్ డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ విద్యా విధానం ప్రకారం దీనిని అప్‌గ్రేడ్ చేశామన్నారు.

మొత్తం నాలుగేళ్ల పాటు ఉండే ఈ కోర్సులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఆరు సెమిస్టర్లలో థియరీ క్లాసులు చెబుతారు. ఏడవ సెమిస్టర్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక చివరిదైన ఎనిమిదవ సెమిస్టర్‌లో పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వంటి వ్యాపార మెళకువలపై ప్రాక్టికల్‌గా తర్ఫీదు ఇస్తారు. చదువు పూర్తయ్యాక విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సొంతంగా డెయిరీలు పెట్టుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని డీన్ వివరించారు. 