LIVE : కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్​ఎస్​ ఛార్జిషీట్‌ - విడుదల చేస్తున్న కేటీఆర్

🎬 Watch Now: Feature Video

thumbnail
కేటీఆర్ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 11:38 AM IST

|

Updated : September 2, 2026 at 12:18 PM IST

1 Min Read
Choose ETV Bharat

LIVE : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి పార్టీ నేటి నుంచి వారం పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఎన్నికల హమీల అమలును గుర్తు చేయడంతో పాటు పాలనా వైఫల్యాలపై ఆయా వర్గాల ప్రజలను భాగస్వామ్యుల్ని చేస్తూ నిరసనలు, ర్యాలీలు, సదస్సులు నిర్వహించనుంది. పోరుబాటకు ప్రారంభంగా తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఛార్జ్‌ష్టీట్‌తో పాటు లోగోను విడుదల చేస్తున్నారు. అటు ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, భారీ ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ప్రజలకు బకాయి ఉన్న హామీలను గుర్తు చేస్తూ ‘బాకీ కార్డుల’ పంపిణీ చేపట్టనుంది. మూడో తేదీన రైతు సదస్సుల రూపంలో సాగునీరు, విద్యుత్‌, యూరియా, బీమా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు చేపడతారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు, 2,500 ఆర్థిక సాయం, K.C.R కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలు లక్ష్యంగా నాలుగో తేదీన మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు చేపడతారు.

Last Updated : September 2, 2026 at 12:18 PM IST