బసవతారకం ఆసుపత్రిలో సంజూ బాబా - SANJAY DUTT MET BALAKRISHNA
🎬 Watch Now: Feature Video

Published : July 6, 2026 at 9:00 PM IST
Sanjay Dutt at Basavatarakam Cancer Hospital : బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. హాస్పిటల్ ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ, ట్రస్టు బోర్డు సభ్యులు నారా బ్రాహ్మణి, జె.ఎస్.ఆర్. ప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. సంజయ్ దత్ ఆసుపత్రి ఆవరణలోని స్వర్గీయ నందమూరి బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్‌లోని పెట్ సిటి, రేడియేషన్, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగాలు, చిన్నారుల వార్డులను సంజయ్ దత్ సందర్శించారు. అక్కడి రోగులను పరామర్శించి చిన్నారులకు పండ్లు, బహుమతులు పంపిణీ చేశారు. తన తల్లి బసవతారకం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామని బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా మారుస్తామని చెప్పారు. క్యాన్సర్‌పై పోరాటానికి ఎంతో మనోధైర్యం అవసరమని సంజయ్ దత్ అన్నారు. తానూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను జయించానని గుర్తుచేశారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే భయపడకుండా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బాలకృష్ణ నేతృత్వంలో ఈ ఆసుపత్రి పేద రోగులకు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.