కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అజయ్​ దేవ్​గణ్​ కుమార్తె

🎬 Watch Now: Feature Video

thumbnail
కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న నైసా దేవగణ్ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : August 28, 2026 at 1:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

Nysa Devgan Visited Keesaragutta : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కుమార్తె నైసా దేవగణ్​ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వెంటనే నైసా దేవగణ్​కు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గుట్టపై ఉన్న అన్ని దేవుళ్లను దర్శించుకుని హారతి తీసుకున్నారు. పూజారులు వేదమంత్రాలు చదివి నైసాకు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నైసా దేవగణ్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పూజరి కీసరగుట్టకు సంబంధించిన పురాతన చరిత్రను, ఆ గుట్టకు కీసరిగుట్ట అని పేరు ఎలా వచ్చిందనే దానితో పాటు ఆ గుట్టకు సంబంధించిన ఇతర విశేషాలను వివరించారు. అనంతరం నైసా ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడి కుమార్తె స్థానిక ఆలయానికి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.