వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్ల ప్రదక్షిణ - వీడియో వైరల్ - BEARS CIRCUMAMBULATIONS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 1:39 PM IST
Two Bears Circle Around the Statue of Valmiki : రామాయణాన్ని రచించిన వాల్మీకి విగ్రహం చుట్టూ రెండు ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు ఎలుగుబంట్లు విగ్రహం దగ్గర చాలా సేపు సంచరించాయి. విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాల్మీకి మహర్షిని చేతులెత్తి మొక్కాయి. అనంతరం అక్కడి నుంచి సమీపాన ఉన్న కొండల్లోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. విగ్రహాల వద్ద పూజలు నిర్వహించి నైవేద్యంగా సమర్పించిన పండ్లను తినేందుకు ఎలుగు బంట్లు వచ్చి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైన మహాకావ్యాల్లో ఒకటిగా వాల్మీకి రచించిన రామాయణం ప్రసిద్ధి చెందింది. వాల్మీకి మహర్షి రచించిన ఈ గ్రంథం శ్రీరాముని జీవిత చరిత్రను వివరిస్తుంది.