LIVE : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం - ప్రత్యక్షప్రసారం - BALKAMPET YELLAMMA KALYANAM TIMINGS
🎬 Watch Now: Feature Video

Published : July 21, 2026 at 10:17 AM IST
|Updated : July 21, 2026 at 1:23 PM IST
Balkampet Yellamma Kalyana Utsavam Live : నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరుగుతుంది. ఉదయం 11.59 గంటలకు బల్కంపేట అమ్మవారి దివ్య కల్యాణం నిర్వహిస్తున్నారు. ఎల్లమ్మ కల్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా తరలివస్తున్న భక్తుల కోసం 7 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బల్కంపేట అమ్మవారి రథోత్సవం రేపు వైభవంగా జరగనుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేసి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కల్యాణోత్సవానికి వచ్చే వారి కోసం ఆర్ అండ్ బీ ఆఫీస్, జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ ఆసుపత్రి వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.