LIVE: కృష్ణా తీరంలో 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాలు - ప్రత్యక్షప్రసారం - AVAKAYA AMARAVATI FESTIVALS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 6:44 PM IST
|Updated : January 8, 2026 at 8:36 PM IST
Avakaya-Amaravati festivals in Vijayawada Live: మనసుకు ఉల్లాసాన్ని, మేధస్సుకు ఉత్సాహాన్ని ఇచ్చే ‘ఆవకాయ్- అమరావతి ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయవాడ కృష్ణాతీరంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పున్నమి ఘాట్‌లో కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం బాహుబలి వేదికను అధికారులు సిద్ధం చేశారు. తెలుగుతనం ఉట్టిపడేలా జమిందారు కాలం నాటి కోట ఆకృతిని వేదికపై సిద్ధం చేశారు. వేదిక ముందు ఆవకాయ్‌ను గుర్తుచేసేలా ఎర్రని రంగు వస్త్రాలతో ప్రత్యేక ఆకృతిని తీర్చిదిద్దారు. ఫ్లోటెడ్ హోమ్ బోట్స్‌తో పాటు మూన్‌లైట్ ఫ్లోటెడ్ బోట్ కమ్ ఫంట్ కూడా అందుబాటులోకి రానుంది. కృష్ణానదిలో బోటింగ్, సినీ విశేషాలు, డ్యాన్సులు, ప్రముఖుల చర్చలు, మ్యూజిక్, వర్క్‌షాపులు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కళాకారులు, ప్రముఖ గాయకులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి ఉచితప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు ప్రత్యక్షప్రసారం మీకోసం.