నల్లమల అడవుల్లో బయటపడ్డ 8 శాసనాలు - తెలుగు లిపిలో ఉన్నట్లు గుర్తించిన పురావస్తు శాఖ - ANCIENT HISTORY IN NALLAMALA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 12, 2026 at 2:33 PM IST
Team Of Archaeology Department Officials In The Yarragondapalem Forest Area : నల్లమల అడవుల్లో దాగిన పురాతన చరిత్రను వెలికి తీసేందుకు మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని అటవీ ప్రాంతంలో పురావస్తుశాఖ అధికారుల బృందం పర్యటిస్తోంది. మూడు రోజుల పరిశోధనలో భాగంగా మొదటిరోజు ఎనిమిది శాసనాలను గుర్తించి వాటి లిపి అచ్చులను పురావస్తుశాఖ అధికారులు సేకరించారు. ఈ శాసనాలన్నీ తెలుగు లిపిలోనే ఉండటం గమనార్హం. క్రీ.శ 7 నుంచి 16వ శతాబ్దం మధ్యలో వేసినవిగా భావిస్తున్న ఈ శాసనాల్లో శ్రీశైలం మల్లికార్జునస్వామికి కాకతీయులు, విజయనగర రాజులు తమ భూములు సమర్పించినట్లు ఉంది. పొన్నలబయలులో క్రీ . శ 1404లో మొదటి దేవరాయలు వేసిన శాసనాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. దీనికి సమీపంలోనే ఉత్పత్తి పిడుగు శాసనం కూడా బయటపడింది. అటవీ ప్రాంతంలో గుర్తించిన శాసనాలన్నింటినీ పరిశోధిస్తే చరిత్ర మరింత లోతుగా తెలుస్తుందని బృందానికి నేతృత్వం వహించిన పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి తెలిపారు.